కరీంనగర్‌ బీజేపీ కార్యాలయంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ కరీంనగర్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు రమావత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా జయంతి (Birsa Munda Jayanti), జాతీయ గౌరవ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఎస్టీ మోర్చా నాయకులతో కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి, అటవీ హక్కులు, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. గిరిజన సమాజం పట్ల ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ దివస్’గా ప్రకటించడం గిరిజనులకు దక్కిన గౌరవమని తెలిపారు. గిరిజనుల సంక్షేమం, విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేసేలా ఎస్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న, కార్పొరేటర్లు బండ రమణ , వెస్ట్ జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి , ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లావుడియా తిరుపతి నాయక్ కార్యదర్శి బానోత్ శివ నాయక్ సోషల్ మీడియా కోకన్వీనర్ మాలోతు దీక్షిత్ నాయక్ బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు జిల్లా ఎస్టీ మోర్చా పదాధికారులు, బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>