కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) చేరుకున్నారు. హరీశ్ రావు తండ్రి కీర్తిశేషులు తన్నీరు సత్యనారాయణ రావు సంవత్సరీక (వర్ధంతి) కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ రావు చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని సత్యనారాయణ రావుకి శ్రద్ధాంజలి ఘటించారు.

