కలం, కరీంనగర్ బ్యూరో: హైదరాబాద్‌లో న్యాయవాది ఖాజా మొయినోద్దీన్ హత్యకు నిరసనగా సోమవారం కరీంనగర్ (Karimnagar) బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. వెంటనే నిందితులను పట్టుకుని, కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ చంద్రపాటి కిరణ్ కుమార్, మాజీ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు, కార్యవర్గ సభ్యులు బండ శివకుమార్, సుంకె దేవ కిషన్, బెజ్జంకి శ్రీకాంత్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Read Also: డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా నిబంధనలు సవరించిన కేంద్రం
Read Also: సర్కార్ ఆస్పత్రులు అస్తవ్యస్తం

