కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సోమవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా ఆటా మహాసభల లక్ష్యాలు, కార్యక్రమాల వివరాలను రేవంత్ రెడ్డికి వివరించారు. సీఎంని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు.
Read Also: ఇందిరమ్మ చీరల డిజైన్ లను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

