Mobile Popup Ad
Mobile Popup Ad

డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా నిబంధనలు సవరించిన కేంద్రం

క‌లం, వెబ్‌డెస్క్‌: దేశంలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను పొందే గృహ వినియోగదారులకు మరింత ఉపశమనం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ నిబంధనల (LPG Rules) సవరణ ఉత్తర్వుల‌ను నేడు అధికారికంగా నోటిఫై చేసింది. ఈ నూతన సవరణ ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న గృహ వినియోగదారులకు రెండు ముఖ్యమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారులు పీఎన్‌జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోగా తమ పాత ఎల్‌పీజీ (LPG) కనెక్షన్‌ను పూర్తిగా రద్దు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా భవిష్యత్తులో పీఎన్‌జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారినప్పుడు తిరిగి గ్యాస్ కనెక్షన్ పొందేందుకు వీలుగా ఒక ట్రాన్స్‌ఫర్ వోచర్ ను పొందే అవకాశాన్ని కల్పించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సవరణ భవిష్యత్తులో పీఎన్‌జీ మౌలిక వసతులు లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే లేదా మారే వినియోగదారులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. ముఖ్యంగా తరచుగా బదిలీలు అయ్యే ఉద్యోగులు, వలస కుటుంబాలు, అద్దెకు ఉండేవారు, విద్యార్థులు, పీఎన్‌జీ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు మారే కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. దీని వల్ల వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను భద్రపరుచుకుంటూనే, భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ఎప్పుడైనా సులభంగా పునరుద్ధరించుకోవడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: ఇందిరమ్మ చీరల డిజైన్ లను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>