Mobile Popup Ad
Mobile Popup Ad

బాలికపై అత్యాచారం.. ప్రెస్‌మీట్‌లో నవ్వుకున్న పోలీసులపై వేటు

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు కోయంత్తూరులో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటన (Coimbatore Child Murder Case) తీవ్ర చర్చనీయాంశమయింది. ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ స్పందిస్తూ నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మహిళ ఐజీతో పాటు ఇద్దరు ఐపీఎస్ లు వివరాలు వెల్లడించారు.

ఈ క్రమంలో వారు నవ్వుతూ కనిపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గోర్లు గిల్లుతూ.. ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సామాజిక మాధ్యమాల్లో విపరీతీంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం సీఎం విజయ్ (CM Vijay) వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ స్పష్టం చేశారు.

Read Also: బాలికల విద్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Read Also: లగ్జరీ వెడ్డింగ్స్.. అప్పులు చేసి మరీ వేడుకలు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>