Mobile Popup Ad
Mobile Popup Ad

చక్కెర వాడకండి.. కరీంనగర్ వైద్యుడి భావోద్వేగం!

కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వైద్యుడు (Karimnagar doctor) తన రోగుల ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయి చేసిన విజ్ఞప్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆసుపత్రికి వస్తున్న వందలాది మంది రోగులు జీవనశైలి మార్పుల వల్ల వ్యాధుల బారిన పడుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిత్యం మనం వంటల్లో వాడే రిఫైండ్ ఆయిల్, పంచదార వాడకం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో తన వద్దకు వస్తున్న పేషెంట్లకు అవగాహన కల్పిస్తూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

మనం తినే ఆహారమే మనకు విషంగా మారుతోందని, స్వచ్ఛమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని ఆ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. రిఫైండ్ ఆయిల్ తయారీ ప్రక్రియలో వాడే రసాయనాలు, అలాగే అతిగా చక్కెర వాడటం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని ఆయన వివరించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రకృతి సిద్ధమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. సాధారణంగా వైద్యులు కేవలం మందులు రాసి పంపిస్తారని, కానీ ఈ డాక్టర్ మాత్రం రోగుల ప్రాణాల మీద ఉన్న మక్కువతో తండ్రిలా హెచ్చరించడం గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. నిజమైన వైద్యుడికి ఉండాల్సిన లక్షణం ఇదేనంటూ సదరు డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే లాభాలే ముఖ్యం అనుకునే ఈ కాలంలో, సమాజంపై ఇంతటి బాధ్యత కలిగిన వైద్యులు ఉండటం గర్వకారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>