Mobile Popup Ad
Mobile Popup Ad

హోం గార్డు సుందరయ్యకు కరీంనగర్ సీపీ వీడ్కోలు

​కలం, కరీంనగర్ బ్యూరో: పోలీస్ శాఖలో 30 ఏళ్ల పాటు హోంగార్డుగా పని చేసి సోమవారం రిటైర్డ్ అయిన నాముండ్ల సుందరయ్యకు కరీంనగర్ సీపీ (Karimnagar CP) గౌష్ ఆలం వీడ్కోలు పలికారు. పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో సుందరయ్య‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ​ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. సుందరయ్య నైట్ డ్యూటీ కోర్టు వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తించారన్నారు. 1996లో విధుల్లో చేరి ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో వారి సేవలు వెలకట్టలేనివన్నారు. ​ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (హోంగార్డ్స్) శ్రీధర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవి, కమిషనరేట్‌ అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.

Read Also: డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా నిబంధనలు సవరించిన కేంద్రం

Read Also: లగ్జరీ వెడ్డింగ్స్.. అప్పులు చేసి మరీ వేడుకలు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>