Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్‌పీజీ ధర పెంపు.. క‌ట్టెల పొయ్యితో కాంగ్రెస్ నిరసన

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన ఎల్‌పీజీ (LPG) గ్యాస్ ధరలకు నిరసనగా సోమ‌వారం కరీంనగర్‌ (Karimnagar)లోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన, వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. ఖాళీ సిలిండర్లతో, బీజేపీ వ్యతిరేక నినాదాల ప్లకార్డులతో రోడ్డుపై కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ మాట్లాడారు. గత నెల రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలపైన కక్ష కట్టినట్లుగా విపరీతమైన ధరలను పెంచుతున్నారని వాపోయారు. పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిన్న ఎల్‌పీజీ గ్యాస్ ధర ఒకేసారి 29 రూపాయలు పెంచార‌ని మండిప‌డ్డారు.

ధరలను త‌గ్గించే వరకు పోరాటం

పేద ప్రజలపై భారం మోపుతున్న నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ హెచ్చరించినట్లు ఎన్నికలు పూర్తవగానే ఇప్పుడు ఇంధన ధరలు పెంచుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాటి ప్రభావం నిత్యవసరాలపై పడటంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒకవైపు నరేంద్ర మోడీ తాను విశ్వగురు అని, ఇది వికసిత భారత్ అని ప్రచారం చేసుకుంటూనే ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ ధరలను త‌గ్గించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు. మోడీ సర్కార్‌కు బుద్ధి వచ్చే విధంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై విపరీతమైన భారం పడుతుంటే నోరు విప్పకుంటే మంచిది కాదని, ఇక్కడున్న కేంద్రమంత్రి, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నార‌ని ప్రశ్నించారు. ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని నిల‌దీశారు. ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని క్షమించాలంటే మీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. 2014లో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు 1200 దాటింద‌ని, సబ్సిడీ ఎత్తేసి ఉజ్వల పథకాన్ని ఉత్త పథకంగా మార్చార‌ని ఎద్దేవా చేశారు. గ్యాస్ నింపుకునే స్థోమత లేక మళ్లీ మహిళలు కట్టెల పొయ్యిల వైపు చూస్తున్నార‌ని చెప్పారు. బీజేపీ తీసుకొచ్చిన‌ ‘అచ్చే దిన్’? ఇదేనా అని ప్ర‌శ్నించారు. వంటింట్లో మంట పెట్టిన బీజేపీని గద్దె దించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగద‌న్నారు. కేంద్రం వెంటనే ధరలు తగ్గించి పాత సబ్సిడీని పునరుద్ధరించాల‌ని, లేకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, మల్లికార్జున రాజేందర్,పులి ఆంజనేయులు గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆకుల నరసయ్య, మడుపు మోహన్, పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్ కళ్యాణి, పడాల అజయ్ గౌడ్, భాస్కర్ నాయక్, వెన్నం రజిత రెడ్డి,మామిడి సత్యనారాయణ రెడ్డి, అబ్దుల్ రహమాన్, అమీర్, భగవాన్ దాస్, వాయినాల సత్యనారాయణ, బండి శరణ్య, సత్తినేని శ్రీకాంత్, షబానా మహమ్మద్, వీర దేవేందర్, సిరిపురం లావణ్య నాగ ప్రసాద్, అస్తపురం తిరుమల, జల్లోజు శ్రీనివాస్, బత్తిని చంద్రయ్య గౌడ్, మాదాసు శ్రీనివాస్, వజీర్, వసీం, శిల్ప, వేముల పుష్పలత, వంగల విద్యాసాగర్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, శ్రీరాముల రమేష్, నెల్లి నరేష్, సుదర్శన్, వహాబ్, పొన్నం మధు, పెంట శేఖర్, గోపు మల్లారెడ్డి, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హైమద్, మూల జైపాల్, నాగుల సతీష్, దండు రవీందర్, రామిడి తిరుపతి, సలీమ్ ఉద్దీన్, చింతల కిషన్, శారద, ఎలగందుల మునీందర్,ఈశ్వరి, ఇమామ్, కలిముద్దీన్, కాసెట్టి శ్రీనివాస్, కొట్టే ప్రభాకర్, బొబ్బిలి విక్టర్, గడప శ్రీనివాస్, అందే శంకర్, ఇమ్రాన్, ఊకంటి రవీందర్ రెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, జీడి రమేష్, జ్యోతి రెడ్డి, హసీనా, హర్ష మల్లేశం, వేల్పులవెంకటేష్, పోరండ్ల రమేష్, ములకల కవిత, కోడూరు రవీందర్ గౌడ్, కర్రె పావని, మీసా రమాదేవి, కొల గాని అనిల్ తో పాటు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>