సుప్రీంకోర్ట్ వీడియోల షేరింగ్‌‌పై నిషేధం

కలం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్ట్ (Supreme Court) వీడియోలను ఇక నుంచి సోషల్ మీడియాలో షేర్ చేయకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కావని పేర్కొన్న సుప్రీంకోర్ట్.. ఇక నుంచి తమ అనుమతి లేకుండా వీడియోలు పోస్ట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

కోర్ట్ గౌరవానికి భంగం..

సోషల్ మీడియాలో సుప్రీంకోర్ట్ వీడియోల షేర్ కారణంగా.. కోర్ట్ గౌరవానికి భంగం కలిగించే ముప్పు ఏర్పడుతోందని పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను కూడా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే.. ఇక నుంచి సుప్రీంకోర్ట్ అనుమతి లభించాకే.. వీడియోలను విడుదల చేయాలని చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>