భద్రాచలంలో ఘోర ప్రమాదం.. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌గా(Temple Inspector) పనిచేస్తున్న రామిరెడ్డి (38) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామిరెడ్డి ద్విచక్ర వాహనంపై భద్రాచలం నుంచి కూనవరం వైపు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన సీఆర్‌పీఎఫ్ వాహనం ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఆయనను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రామిరెడ్డి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాచలం రామాలయంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందిస్తున్న రామిరెడ్డి ఆకస్మిక మృతితో ఆలయ వర్గాల్లో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>