ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై కరీంనగర్ కలెక్టర్ కీలక నిర్ణయం

కలం, కరీంనగర్ బ్యూరో : అధికారులు సమన్వయంతో పని చేస్తూ ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ (Karimnagar Collector) అన్నారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాలవర్షాల కారణంగా ధాన్యం తడవకుండా అన్ని కేంద్రాల్లో నూరు శాతం టార్పాలిన్ ఉండాలని ఆదేశించారు. అత్యధికంగా ధాన్యం సేకరించాల్సిన కేంద్రాల సమీపంలో తాత్కాలిక స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లలోనూ వేగం పెంచాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. ఎక్కువ మొత్తంలో ధాన్యం సేకరణకు వస్తే జిల్లాలో ధాన్యం నిల్వచేసేందుకు అదనపు నిల్వ కేంద్రాలను గుర్తించాలన్నారు.

ప్రత్యేక బృందం సంయుక్త పర్యవేక్షణ

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రతి కేంద్రానికి ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించాలని కలెక్టర్ (Karimnagar Collector) అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల, రెవిన్యూ, పోలీస్, రవాణా శాఖల అధికారులతోపాటు ప్రత్యేక అధికారి ఈ బృందంలో ఉంటారని తెలిపారు. ఈ బృందం సభ్యులు ప్రతిరోజు కొనుగోలు కేంద్రంలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్డీవో రమేష్ బాబు, పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, పౌరసరఫరాల సంస్థ డీఎం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>