రోగులకు ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులే: మంత్రి రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్: నర్సింగ్ అనేది కేవలం ఒక వృత్తి కాదు అని.. మానవత్వానికి చేసే గొప్ప అవకాశం అని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. రోగులకు చికిత్స అందించడమే కాకుండా.. వారికి ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులేనని కొనియాడారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మీర్జా రహ్మత్ బేగ్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నర్సులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నర్సులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోజునే నియామక పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఈరోజు నర్సులకు జీవితాంతం గుర్తిండిపోతుందని చెప్పారు. ప్రపంచ నర్సింగ్ రంగానికి మార్గదర్శకురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలని చెప్పారు. పరిశుభ్రత, క్రమశిక్షణ, శాస్త్రీయ వైద్య సేవల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయురాలు ఆమె అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు కూడా పేషెంట్ల దగ్గర ఉండలేని పరిస్థితి ఉందని, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నర్సులు సేవలు అందించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆ సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు.

గతంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎక్క్కువ ఖాళీలు ఉండటం వల్ల వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉండేదని అన్నారు. ఈ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని భారీ స్థాయిలో నియామకాలు చేపట్టిందని చెప్పారు. గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశాఖలో దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేశామని అన్నారు. ఇదే గ్రౌండ్‌లో ఇప్పటికే 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశామని వివరించారు. ఇక్కడే 623 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌లకు, 132 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు నియామక పత్రాలు అందించామని చెప్పారు. నేడు ఇక్కడే 1,919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>