కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కరీంనగర్ (Karimnagar) కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 353 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే, పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: సీఎం విజయ్‌తో భేటీపై విమర్శలు.. ఖుష్బూ స్ట్రాంగ్ వార్నింగ్!
Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్

