కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంధనంపై విధిస్తున్న వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఓ బహిరంగ లేఖను రాశారు. ఒకవైపు ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధిక వ్యాట్ వసూళ్ల ద్వారా ఏడాదికి దాదాపు 2,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని అర్జిస్తోందని ఆయన ఆరోపించారు.
ఎన్నికలకు ముందు ఇంధన ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కలిగిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్‌లో కనీసం 0.1 శాతం కూడా తగ్గించకపోవడం దారుణమని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల కష్టాలను చూసి లాభాలు గడించడం మానుకొని, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాన్యుడిపై భారాన్ని తగ్గించేందుకు గాను పెట్రోల్, డీజిల్‌లపై విధిస్తున్న వ్యాట్‌ను తక్షణమే కనీసం 10 శాతం మేర తగ్గించాలని ఆయన సీఎంను డిమాండ్ చేశారు.
Read Also: బాలికల విద్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

