కలం, వెబ్ డెస్క్ : బాలికల విద్యపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్‌లు, టాయిలెట్లు లేక బాలికలు చదువును (Girls Education) వదులుకోకూడదని చెప్పింది. పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్లు తప్పనిసరి అని వ్యాఖ్యానించింది. మహిళా విద్యార్థులకు ఉచిత శానిటరీ నాప్‌కిన్‌లు, పాఠశాలల్లో పనిచేసే, లింగ-విభజన కలిగిన మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని జనవరి 30న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు కేంద్రం జవాబు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు బాలికల విద్యా హక్కును కాపాడాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిస్థితిని పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి తీర్పును సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం ఈ అంశంపై కేంద్రానికి నివేదికలను అందించడంలో విఫలం కావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: సీఎం విజయ్‌తో భేటీపై విమర్శలు.. ఖుష్బూ స్ట్రాంగ్ వార్నింగ్!
Read Also: మన గుడులు.. మన సంస్కృతి

