కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో అనుమతులు లేకుండా ర్యాంక్ ఫోర్డ్ ఆకాడమీ, గ్రావిటీ అకాడమీ పేర్లతో ఇంటర్ అడ్మిషన్లు చేపడుతున్న యజమానులపై క్రిమినల్ కేసు ను మోదు చేయాలని ఏఐవైఎఫ్ (Karimnagar AIYF) రాష్ట్ర సహాయకార్యదర్శి భావండ్లపెల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్లు జిల్లా డీఈఓ కార్యాలయము నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్, IIT, JEE, NEET పేర్లతో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ ఇంటర్ బోర్డు నుండి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్ అడ్మిషన్లు చేపడుతున్నారని, గతంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు.
తప్పుడు ఫలితాలను చూపుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వాపోయారు. దీంతో పాటు తప్పుడు ప్రచారం చేస్తూ హోర్డింగ్ లు కడుతున్నారని, వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యుగంధర్ డిమాండ్ చేశారు. విద్యార్థులను కేవలం పత్రికా ప్రకటనతో సరిపెట్టారని తెలియజేస్తూ, ఇట్టి అనుమతి లేని కోచింగ్ సెంటర్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నందున సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకొనే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిల భారత యువజన సమైఖ్య( Karimnagar AIYF) ఆందోళన చేస్తుందని యుగంధర్ హెచ్చరించారు.
Read Also: ప్రేయసిని కలవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఫిట్‌నెస్ ట్రైనర్
Follow Us On : WhatsApp

