Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మా ధ్యేయం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ (Kariamnagar) నగరంలోని 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వాటర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు డిప్యూటీ మేయర్ (Deputy Mayor) యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) ఘన స్వాగతం పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్ క్వాటర్స్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఇష్టమైన బెలూన్లు, బొమ్మలు, వివిధ రకాల వస్తువులను అందించి స్వీట్లు పంపిణీ చేస్తూ.. ఎర్రటి కార్పెట్ పరిచి చిన్నారులకు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటికే గత రెండు రోజుల క్రితమే పాఠశాల ఆవరణను శుభ్రపరిచి మంచి అహ్లాదవాతావరణం కల్పించిగా.. పాఠశాల మొదటి రోజు పేద విద్యార్థుల ముఖంలో సంతోషం, ఉత్సాహం కలిగేలా ఘన స్వాగతం పలికారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలలకు ఆనందంతో వచ్చేలా పరిశుభ్రమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యంతో మా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు భగత్ నగర్ పోలీస్ క్వాటర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మా పార్టీ శ్రేణులతో కలిసి వారికి ఇష్టమైన వస్తువులను అందించి రెడ్ కార్పెట్ పరిచి ఘనంగా స్వాగతం పలికామని అన్నారు.

మొదటి రోజు పాఠశాలకు వచ్చిన చిన్నారుల ముఖాల్లో ఆనందం, సంతోషం చూసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గతంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో సుమారు రూ. 26 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు గుర్తుచేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక క్లాస్ రూములు, డిజిటల్/స్మార్ట్ క్లాసులు, స్వచ్ఛమైన తాగునీరు, డైనింగ్ హాళ్లు, మరుగుదొడ్ల వసతులను కల్పించామని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, విద్యా ఫలాలు విద్యార్థులకు పూర్తిగా అందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఉపాధ్యాయులు సమర్థవంతంగా సేవలు అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వాలు అందించే మెరుగైన సేవలను విద్యార్థులకు అందించి రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి అన్ని పార్టీల వారు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, డివిజన్ కు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>