Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ సిటీలో నీటికి కటకట.. నీటి వాడకంపై కఠిన ఆంక్షలు

కలం, వెబ్ డెస్క్: రుతుపవనాల రాక ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతుండటంతో పూణే (Pune) మున్సిపల్ కార్పొరేషన్ కఠిన ఆంక్షలు అమలుచేసింది. జూన్ 15 నుంచి నగరానికి రోజు విడిచి రోజు నీటి (Water) సరఫరాను ప్రారంభించింది. ఖడక్‌వాస్లా, పాన్‌షేత్, వరస్‌గావ్, టెమ్‌ఘర్ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను ఆగస్టు 20 వరకు పొదుపుగా వాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షల్లో భాగంగా స్విమ్మింగ్ పూల్స్, కార్ వాషింగ్ సెంటర్లు, నిర్మాణ రంగ పనులకు నీటిని వాడటాన్ని నిషేధించింది. అలాగే హౌసింగ్ సొసైటీలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు శుద్ధి చేసిన రీసైకిల్ నీటిని మాత్రమే ఇతర అవసరాలకు ఉపయోగించాలని తెలిపింది.

కీలక సూచనలివే..

  • తాగునీటిని జాగ్రత్తతో వాడాలి.
  • లీకవుతున్న కుళాయిలను మరమ్మత్తు చేయాలి.
  • తాగునీటిని వాహనాలు, ప్రాంగణాలు కడగడానికి ఉపయోగించవద్దు.
  • ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు పొంగిపొర్లడాన్ని నివారించాలి.
  • స్నానానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రం చేయడానికి అవసరమైన నీటినే వాడాలి.
  • నిర్మాణ పనులకు తాగునీటిని ఉపయోగించవద్దు.
  • హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు ప్రత్యేక నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలి.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>