హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. కొత్తలోక చాప్టర్ 1 మంచి హిట్ అయింది. దాదాపు రూ.200 కోట్లకంటే ఎక్కువ కలెక్షన్లు సాధించింది ఈ మూవీ. ఇందులో కళ్యాణి తన పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. ‘నేను ఈ సినిమాలో లీడ్ రోల్ చేసేటప్పుడు చాలా అనుమానాలు కలిగాయి. అసలు ప్రేక్షకులు, రివ్యూవర్లు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ పడ్డాను. అందుకే రిలీజ్ అయి మంచి టాక్ వచ్చేదాకా నా ఇంట్లో రూమ్ నుంచి బయటకు రాలేదు. అందరూ బాగుంది అని ఫోన్లు చేశాక నాకు ధైర్యం వచ్చింది. అప్పటి వరకు చాలా భయంతో బయటకు రావడానికే ఇబ్బందులు పడ్డాను’ అంటూ తెలిపింది కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan).
ఈ సినిమాలో తన పాత్ర నిజంగానే ఛాలెంజింగ్ గా అనిపించిందని.. ఇలాంటి పాత్రలు చేశాకే తన మీద తనకు పూర్తి నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చింది కల్యాణి. కల్యాణి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా కొత్తలోకా చాప్టర్ 1 రికార్డులు సృష్టించింది. కేవలం మౌత్ టాక్ తోనే హిట్ అయింది. అన్ని భాషల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది కొత్తలోక. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే తెలిపారు. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు స్టార్ట్ అవుతాయని మూవీ టీమ్ చెబుతోంది.


