Mobile Popup Ad
Mobile Popup Ad

పార్టీ జెండా రంగుపై కవిత సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లలో వేగం పెంచారు. ఈనెల 25వ తేదీన తన కొత్త పార్టీ ఆవిర్భావోత్సవం ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన కవిత.. దానికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అయితే తాను ఏర్పాటు చేయబోయే పార్టీ జెండా రంగుపై ఆమె ట్విట్టర్ లో స్పందించారు. తన కొత్త రాజకీయ పార్టీ జెండా, ఎజెండాలో నీలిరంగు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమ దర్శనికతకు, మాట ఇస్తే తుది వరకు కట్టుబడి ఉండే నమ్మకత్వానికి నీలం రగం చిహ్నమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరు కలర్ థియరీ అనే హ్యాష్ ట్యాగ్ ను తన పోస్ట్ కు జత చేశారు.

కాగా, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా తన కొత్త రాజకీయ పార్టీపై కల్వకుంట్ల కవిత ప్రకటన చేశారు. ఈ నెల 25న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వేషన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువత, మహిళలకు తమ పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెప్పారు. ఇన్నాళ్లు మగవాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలను చూశారని, తెలంగాణ ఆడబిడ్డగా తాను పార్టీ పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారని తెలంగాణ ప్రజానీకానికి తెలియజేశారు. తమ పార్టీ రాకతో నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా సాధింకుంటామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>