Mobile Popup Ad
Mobile Popup Ad

చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి

కలం, వరంగల్ బ్యూరో : సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు విగత జీవులై తేలారు. ఈ విషాదం మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని నీలవంచ చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన వారు తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చారు. మృతులు కత్తుల శిరీష (9), చైత్ర (9)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టమ్ నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలికల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>