పార్టీ ఏర్పాటుపై శ్రీరామనవమి రోజున కవిత ప్రకటన?

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. రాజకీయాల్లో తన మార్క్‌ను చూపించాలనుకుంటున్నారు. కొత్త రాజకీయ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు వడివడిగా ఆమె పావులు కదుపుతూ వచ్చారు. తాజాగా కవిత కొత్త పార్టీపై మరో విషయం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీరామనవమి రోజున కవిత కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అదేరోజున పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మార్చి 27న నిజామాబాద్‌లోని ఖిల్లా రామాలయంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కవిత (Kavitha) పాల్గొననున్నారు. ఈ వేడుకల్లోనే కీలక ప్రకటన చేస్తారని సమాచారం. “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో కవిత పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పేరుతో ఆమె జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. పేరు నమోదులో ఆలస్యం జరుగుతోందని ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు.

Read Also: మహిళా రిజర్వేషన్లపై కుట్రలు: బండి సంజయ్

Follow Us On: Facebook 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>