కలం, వరంగల్ బ్యూరో: ‘మాతృత్వం ఒక వరం, దానికి చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం’ అని హన్మకొండ (Hanamkonda) కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Chahat Bajpai) అన్నారు. బుధవారం కంచరకుంటలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక దత్తత విభాగాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం ఓ శిశువును వడ్డేపల్లికి చెందిన దంపతులకు దత్తతగా అప్పగించారు. ఆ దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకోగా సీనియారిటీ ఆధారంగా నాలుగు నెలల శిశువును దత్తతగా అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ దత్తత చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. ప్రతి దత్తత కూడా కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనలకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నారు.
హన్మకొండ జిల్లా (Hanamkonda) సంక్షేమ అధికారి ఎం. విశ్వజ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశీయ దత్తత కింద 220 మంది పిల్లలను, విదేశీ దత్తత కింద అమెరికా, మాల్టా, ఇటలీ, దుబాయి వంటి దేశాలకు 12 మంది పిల్లలను దత్తతగా ఇచినట్లు తెలిపారు.
Read Also: నోట్ల రద్దు, కరోనా తర్వాత.. మరోసారి మోదీ కీలక స్టెప్..!
Follow Us On: X(Twitter)

