కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణీ సంగమం వద్ద 12 రోజుల పాటు సరస్వతి అంత్య పుష్కరాలు (Saraswathi Antya Pushkaralu) జరగనున్నాయి. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సరస్వతి పుష్కరాలు మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి.
అయితే గత ఏడాది సరస్వతి ఆది పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగాయి. అదే తరహాలో ఈ సంవత్సం కూడా సరస్వతి అంత్య పుష్కరాల (Saraswathi Pushkaralu) కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సుమారు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఘాట్‌ల ఆధునికీకరణ, టెంట్ సిటీ నిర్మాణం
జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్, వీఐపీ ఘాట్ ప్రాంతాలను ప్రత్యేక అలంకరణలు, అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టమ్స్‌తో అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) సంగమ తీరాన్ని తలపించేలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా దూరప్రాంతాల నుండి వచ్చే వీఐపీలు, భక్తుల వసతి కోసం సుమారు 40 ఆధునిక గుడారాలతో కూడిన ప్రత్యేక ‘టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు.
రవాణా & పార్కింగ్
గత సంవతర్సరం సరస్వతి ఆది పుష్కరాల సమయంలో భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా మహదేవ్‌పూర్ నుండి కాళేశ్వరం వరకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, అదనపు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్లాన్ చేస్తున్నారు.
భక్తుల రక్షణ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల నిఘా, నది తీరంలో గజ ఈతగాళ్లు, భారీగా పోలీసు బందోబస్తును మోహరిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శాశ్వత నిర్మాణాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: న్యాయ వ్యవస్థలో కీలక మార్పు.. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు
Follow Us On: X(Twitter)

