కలం, వెబ్ డెస్క్ : మార్కాపురం (Markapuram) జిల్లా యర్రగొండపాలెంలోని (Yerragondapalem) పోలీస్ స్టేషన్ సమీపంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఉడుతల హనుమంతు అనే యువకుడు మద్యం మత్తులో బిఎస్ఎన్ఎల్‌కు చెందిన సుమారు 150 అడుగుల టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. గంజాయి కావాలంటూ, పై నుంచి దూకేస్తానని బెదిరించడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్సై దేవకుమార్ చాకచక్యంగా అతడితో మాట్లాడి కిందకు దించడంలో సఫలమయ్యారు. కిందకు తీసుకొచ్చిన తరువాత ఎందుకు టవర్ ఎక్కావని పోలీసులు ప్రశ్నించగా, ‘నాకు గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్’ అంటూ పోలీసులను బ్రతిమలాడాడు. అనంతరం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Read Also: తప్పులెవరివి? క్రెడిట్ ఎవరిది?: ‘పాలమూరు’పై పొలిటికల్ ఫైట్!
Follow Us On: X(Twitter)

