Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే విధించడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని విమర్శించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ (KCR) , వారి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ .. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా వారిపై ఏ ఒక్క అవినీతి , అవకతవకలపై సమగ్ర విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని గుర్తు చేశారు. అయితే ఆధారాలను సమర్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. ఆ రెండూ పార్టీలు ఒకటేనని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రజాక్షేత్రంలో మాత్రం ఆ రెండు పార్టీలు డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు పార్టీల మధ్య దోస్తీ కారణంగా కేసీఆర్, వారి కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. అవినీతిల విషయంలో ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకుని.. కాళేశ్వరం ప్రాజెక్టులో బీజేపీదే తప్పు అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య బంధం బట్టబయలైందని వెల్లడించారు.

Read Also: అమ్మవారికి నకిలీ వెండి నాణేలు.. కొత్త మోసం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>