బెంగాల్‌లో ‘ఫిష్’ పాలిటిక్స్.. మమతకు అనురాగ్ ఠాకూర్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘చేపల రాజకీయం’ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. బెంగాలీ కల్చర్‌లో భాగమైన చేపలను రాజకీయ లబ్ధి కోసం అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ (BJP) తమ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తినడంపై నిషేధం విధిస్తుందని ఆరోపించింది. దీంతో మమతా వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. తాము చేపలను నిషేధిస్తామనేది అబద్ధమని చేపలతో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మమతా బెనర్జీకి బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) కౌంటర్ ఇచ్చారు. ఆయన స్వయంగా చేపలు తింటూ కనిపించారు. తృణమూల్ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని, బెంగాలీ సంస్కృతిని తాము గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: అమ్మవారికి నకిలీ వెండి నాణేలు.. కొత్త మోసం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>