Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లు అర్జున్ కొత్త ఇల్లు.. ఎంత ఖరీదో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ మూవీతో రూ.వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం, జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా, జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, అల్లు అర్జున్ కెరీర్ పుష్పకు ముందు, తరువాత అన్నట్లు మారిపోయింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన బన్నీ గురించి మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరలవుతోంది. అదే అల్లు అర్జున్ కట్టుకుంటున్న కొత్త ఇల్లు. జూబ్లీహిల్స్ లో దాదాపు 4వేల చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. దీని విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు రూ.80 కోట్లు ఉంటుందట. పనులు వేగంగా జరుగుతుండగా.. ఈ ఏడాది చివర్లో గృహ ప్ర‌వేశం చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి దగ్గరలోనే ఈ ఇంటిని నిర్మించుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

విదేశాల నుంచి ఖరీదైన ఫర్నీచర్..?

కెరీర్ ప్రారంభం నుంచి ప్రస్తుతం తన తండ్రి ఇంట్లోనే ఉంటున్న అల్లు అర్జున్ (Allu Arjun).. ఐకాన్ స్టార్ గా ఎదిగిన తరువాత.. కట్టుకుంటున్న ఇల్లు కావడంతో ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇంట్లోకి కొంత ఫర్నీచర్ కూడా విదేశాల నుంచి తెప్పించుకుంటున్నట్లు టాక్. ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండబోతుందని సమాచారం. ఇక, సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ మూవీ చేస్తుండగా.. ఇటీవలే విడుదలైన ఫస్ట్ పోస్టర్ అంచనాలను అమాంతం పెంచేసింది. 2027లో ఇది విడుదల కాబోతుంది.

Read Also: టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>