Jubilee Hills Exit Polls | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఆరు గంటలతో పోలింగ్‌ను ఆపేశారు. క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతించనున్నారు అధికారులు. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని మూడు పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. దీంతో జూబ్లీ ఉపఎన్నిక అత్యంత రసవత్తరంగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యం పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయింది. సుమారు 50 శాతం పోలింగ్ జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తాయని చెప్తాయాని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే..
Jubilee Hills Exit Polls |
పబ్లిక్ పల్స్ (శ్రీనివాస్) : కాంగ్రెస్ 48.5(+-2), బీఆర్ఎస్ 41.5(+-2), బీజేపీ 6.5 (+-2)
నాగన్న సర్వే: కాంగ్రెస్ 47.84, బీఆర్ఎస్ 41.46, బీజేపీ 8.71
జన్‌మైన్ సర్వే: కాంగ్రెస్ 42.5, బీఆర్ఎస్ 41.5, బీజేపీ 11.5
చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46శాతం, బీఆర్ఎస్ 41, బీజేపీ 6శాతం ఓట్లు
స్మార్ట్ పోల్: కాంగ్రెస్ 48.2, బీఆర్ఎస్ 42.1 శాతం, బీజేపీ 9.7 ఓట్లు
పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48శాతం, బీఆర్ఎస్ 41, బీజేపీ 6శాతం
హెచ్ఎంఆర్ అంచనా: కాంగ్రెస్ – 48.31 శాతం, బీఆర్ఎస్ – 43.18 శాతం, బీజేపీ – 5.84 శాతం
Read Also: ముగిసిన బీహార్ పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే..
Follow Us on : Pinterest

