7 వారాల్లో 10 కిలోలు తగ్గిన ఎన్టీఆర్.. కారణం ఇదే

కలం, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) తన పాత్ర కోసం ఎంతగా మారిపోతాడో మనందరికీ తెలిసిందే. పాత్రకు తగ్గట్టు తన బాడీ లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటాడు. తాజాగా 7 వారాల్లోనే ఏకంగా 10 కిలోల దాకా తగ్గాడు ఎన్టీఆర్ (JR NTR). ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న భారీ మూవీ కోసం తన బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇందులో తన పాత్రకు సంబంధించిన ఓ సీన్ లో ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపించాల్సి ఉందంట. దాని కోసం వీఎఫ్ ఎక్స్ లాంటివి వాడకుండా నిజంగానే బరువు తగ్గడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పాడు.

తన ఫిట్ నెస్ ట్రైనర్ దగ్గర కఠిన ట్రైనింగ్ తీసుకుని.. డైట్ మెయింటేన్ చేస్తూ ఏడు వారాల్లోనే 10 కిలోల బరువు తగ్గాడు. తన లుక్ ను కంప్లీట్ గా మార్చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్లు కూడా ఇవ్వట్లేదు. ఈ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఏ సినిమాకు కూడా ఇంతగా బరువు తగ్గలేదు. మరి ప్రశాంత్ నీల్ తన సినిమాలో ఎన్టీఆర్ ను ఎలాంటి లుక్ లో చూపిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>