కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్‌తో మూవీని మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో మూవీ ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ సినిమా అనౌన్స్మెంట్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దం అవుతున్నారు. అత్యాధునిక వీఎఫ్ఎక్స్ పనులతో రూపొందిస్తున్న ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం మేకర్స్ వేగంగా పని చేస్తున్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా రావాలని మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనితో ఎన్టీఆర్ (NTR) బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి డబుల్ సర్ప్రైజ్ అందనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై ఫ్యాన్స్‌లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Read Also: మే 2026లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భారీ రాబడినిచ్చే టాప్ ఎస్‌ఐపీలు ఇవే!
Follow Us On : WhatsApp

