Mobile Popup Ad
Mobile Popup Ad

లక్సెట్టిపేటలో రైతుల మృతి.. కవిత తీవ్ర దిగ్భ్రాంతి!

కలం, వెబ్‌డెస్క్: మంచిర్యాల (Mancherial) జిల్లా లక్సెట్టిపేటలో ఈదురుగాలుల ధాటికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోడ కూలి నలుగురు రైతులు మృతి చెందిన ఘటనపై టీఆర్ఎస్ చీఫ్ కవిత (TRS Chief Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నలుగురు రైతన్నలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా వారం రోజుల వ్యవధిలో ఏడుగురు రైతులను ఈ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు మృతిచెందారని ఆరోపించారు. మృతి చెందిన రైతుల కుటుంబాలను ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా మరణించిన ప్రతి రైతు కుటుంబానికి వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని కవిత (TRS Chief Kavitha) కోరారు.

Read Also: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు ఊరట: బెయిల్ మంజూరు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>