కలం, జోగుళాంబ గద్వాల్: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎస్సై ఎమ్.ఏ సమద్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అందజేశారు. జోగుళాంబ గద్వాల్ జిల్లా (Jogulamba Gadwal) పోలీస్ శాఖకు చెందిన ఏఎస్సై ఎం.ఎ.సమద్ గత సంవత్సరంలో మే నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతి చెందిన ఏఎస్సై భార్య సజిదా సుల్తానాకు రూ. 5,00,000 చెక్ ను మంగళవారం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు అందజేశారు.
చీఫ్ ఆఫీస్ వెల్ఫేర్ గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో భాగంగా ఏఎస్సై భార్య సజిదా సుల్తానా కు రూ. 5,00,000 (ఐదు లక్షలు) చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ సహాయం వారి కుటుంబానికి కొంత భరోసానిస్తుందని, జిల్లా పోలీస్ శాఖ తరఫున ఏఎస్సై కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి. సతీష్ కుమార్, ఆఫీస్ సూపర్డెంట్ బి. నాగమణి, జూనియర్ అసిస్టెంట్ గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.

