Mobile Popup Ad
Mobile Popup Ad

బోధన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా బోధన్ (Bodhan) పట్టణంలోని వివిధ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, రెస్టారెంట్లలో ఆహార భద్రత అధికారి నవిత ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన పలు లోపాలు గుర్తించారు. కొన్ని సంస్థల్లో సింథటిక్ ఆహార రంగులు టేస్టింగ్ సాల్ట్ (ఎంఎస్‌జీ) వినియోగం ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన మిగిలిపోయిన ఆహార పదార్థాలు కూడా బయటపడ్డాయి.

సంబంధిత ఆహార వ్యాపార నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ జారీ చేశారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 నియమాలు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తగిన జరిమానాలు విధిస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అన్ని ఆహార వ్యాపార నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, నిర్దేశిత పరిశుభ్రత పారిశుద్ధ్య ప్రమాణాలను నిర్వహించాలని సూచిస్తున్నారు,

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>