‘ప్రభుత్వ భూములు పేదలకే దక్కాలి’

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ భూములు అర్హులైన పేదలకే దక్కాలని, అందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా తెలంగాణ సర్వోదయ మండల్ మహాసభ తీర్మానించింది. సోమవారం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కేంద్రంలోనీ వాల్మీకి‌ భవన్‌లో సర్వోదయ మండల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. సర్వ సేవా సంఘ్ రాష్ట్ర ఇంచార్జ్ షేక్ హుస్సేన్, జాతీయ కార్యదర్శి అవినాష్, సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్, సర్వోదయ మండల్ మహిళా సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు ప్రవీణ, జిల్లా సెక్రటరీ రంగన్న, గద్వాల్ జిల్లా ఎఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బీ ఆంజనేయులు, వివిధ మండలాల నాయకులు ఈ మహాసభలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గాంధీజీ, వినోబాభావే ఆశయాలను నెరవేర్చేంచుకు కృషి చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. భూదాన్ భూముల రక్షణ కోసం, భూదాన్ యజ్ఞ బోర్డ్ ఏర్పాటుపై తీసుకోవలసిన చర్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. సర్వోదయ మండల్ సభ్యులు, సానుభూతిపరులు, పేదలకు చెందవలిసిన భూదాన్ భూముల రక్షణ కోరే ప్రతి ఒక్కరు ఈ సభకు హాజరై విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు.

Read Also: ఎల్‌పీజీ ధర పెంపు.. క‌ట్టెల పొయ్యితో కాంగ్రెస్ నిరసన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>