కలం, యాదగిరిగుట్ట: రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాలమ్మ ఊంజల్ సేవా ఉత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే వేకువజామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు.
నిత్య పూజలతో పాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులను పూజించి.. బాలాలయంలో ఆర్జిత పూజలను చేపట్టారు. ఉత్సవ మూర్తులకు పాలాభిషేకం చేసి దర్శన మూర్తులకు స్వర్ణ పుష్పాలతో అర్పించారు.
పూలమాలలతో అలంకరించి..
సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఉంజల్ సేవా ఉత్సవాన్ని చేపట్టారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి, గంట పాటు వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి సమర్పించారు.
అంతకు ముందు అమ్మవారి సేవను బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవంలో కార్యనిర్వాహనాధికారి భవానీ శంకర్, ఏఈఓ సురేందర్ రెడ్డి, ఆలయ అధికారులు, భక్తులు, మహిళలు పాల్గొని ప్రత్యేక మంగళ హారతులతో అమ్మవారికి పూజలు చేశారు.

