కలం, జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి (Prajavani) మొక్కుబడిగా సాగుతోంది. ప్రతి వారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకాలేకపోతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కీలకంగా భూ సమస్యలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికారులు దృష్టిసారించి పరిష్కరించడంలో విఫలమవుతున్నారు.
ఉన్నతాధికారులు సమయపాలన పాటించడం లేదట
ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు సమయపాలన పాటించడం లేదు. నిరక్షురాస్యులైన ప్రజలు అధికారులకు ఆర్జీ పెట్టుకోవాలన్న ఆర్జీలు రాయడానికి అక్కడ సహాయకులు ఎవరు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు అంటున్నారు. కాగా, ప్రజావాణి కార్యక్రమానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో 10శాతమే పరిష్కరం అవుతున్నాయి. వచ్చిన వారే కొంత సమయం గ్యాప్ ఇచ్చి వస్తున్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజావాణి నడుస్తున్న సేపు.. అధికారులు సెల్ ఫోన్ లో బిజిబిజీగా ఉంటున్నారని చెబుతున్నారు. మద్యాహ్నం 12.45 లోపల అధికారులు ఎవరిదారిన వారు పోతున్నారని చెప్తున్నారు.
Also Read : ‘నా గెలుపు బీజేపీకి ఒక సందేశం’.. పీకే కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

