కలం, వెబ్ డెస్క్ : బీహార్ లోని బంకిపూర్ ఉప ఎన్నికలో సాధించిన విజయంపై జనసురాజ్ పార్టీ (Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన గెలుపు బీజేపీ ఒక సందేశం లాంటిది అని చెప్పారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని.. సీఎం సామ్రాట్ చౌదరిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అలాగే, రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేసి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని కోరారు. అలాగే, గుజరాత్ అభివృద్ధి కోసం బీజేపీ చేసిన కృషి లాగే.. బీహార్ కోసం కూడా పాటుపడాలని సూచించారు.
కాగా, 30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకీపూర్(Bankipur)లో జనసూరాజ్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఇక్కడ జరిగిన ఉపఎన్నికలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Also Read : తిట్టడం గొప్ప కాదు.. యువతకు మను బాకర్ హితవు!
Follow Us On : WhatsApp

