పోలీస్ స్టేషన్ కు బేడీలు.. అధికారుల వింత సమాధానం

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) లోని రూరల్​ పోలీస్​ స్టేషన్​ ప్రధాన గేటుకు అక్కడి పోలీసులు బేడీలు వేశారు. తీవ్రమైన నేరాలు చేసిన ఖైదీలకు, నేరస్థులకు, దొంగల చేతులకు వేయాల్సిన బేడీలను, పోలీసులే నియమ నిబంధనలు పాటించకకుండా పోలీస్​ ​స్టేషన్​ గేటుకు వేసి కనిపించడంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే, ఈ ఘటనపై పోలీసు అధికారులు చెప్పిన సమాధానం వింతగా ఉంది. ‘పోలీస్ స్టేషన్​ ఆవరణలో ఇతరులు వారి బైక్ లు, ఇతర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈరోజు పోలీసు ఉన్నతాధికారులు వస్తుండటంతో గేటుకు తాళం వేయమని చెప్పాం. కానీ పొరపాటున వాళ్లు తాళానికి బదులు బేడీలు వేసి ఉండవచ్చు’ అని ఓ అధికారి తెలిపారు. స్టేషన్ కు బేడీ విషయం స్థానికంగా చర్చ జరగడంతో గేట్ కు ఉన్న బేడీలను తొలగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>