స్టార్ ఫుట్‌బలర్ లియొెల్ మెస్సీ(Lionel Messi).. ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా ! ప్రస్తుతం చర్చ తీవ్రంగా జరుగుతోంది. తాజాగా తన ఫుట్‌బాల్ కెరీర్ గురించి మెస్సీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు దారితీశాయి. రానున్న వరల్డ్ కప్‌లో మెస్సీ ఉండడేమో అన్న చర్చ రోజురోజుకూ అధికం అవుతోంది. వాటికి మెస్సీ వ్యాఖ్యలు మరింత ఊపందించాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మెస్సీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. “ఆడే అవకాశం ఉంటే నేను మైదానంలో ఉంటాను. కానీ ఈ నిర్ణయం పూర్తిగా నా చేతిలో లేదు. ఈ విషయంపై స్కలోనీతో చాలా సార్లు మాట్లాడాను” అని అన్నారు.
ప్రస్తుతం ఇంటర్ మియామీ తరఫున ఆడుతున్న మెస్సీ, తన ఆఖరి వరల్డ్ కప్ 2026 కావచ్చని సంకేతాలు ఇచ్చాడు. అయితే తుది నిర్ణయం త్వరలో తీసుకుంటానని స్పష్టంచేశాడు. తన శరీరం, మానసిక పరిస్థితి, కుటుంబంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించిన మెస్సీ(Lionel Messi)ని అభిమానులు కేవలం ఆటగాడిగానే కాదు, ఫుట్‌బాల్ కళాకారుడిగానే భావిస్తారు. వరల్డ్ కప్, కోపా అమెరికా, లీగ్ టైటిల్స్, బాలన్ డి’ఓర్.. ఇలా అనేక ఘనతలు తన పేరుతోనే ఉన్నాయి. అందుకే “మెస్సీ రిటైర్ అవుతారా?” అన్న ప్రశ్న ఫుట్‌బాల్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది.
Read Also: వాళ్లతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కోవడమే: రవిశాస్త్రి
Follow Us On: Facebook


