Mobile Popup Ad
Mobile Popup Ad

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి..

కలం, మెదక్ బ్యూరో : ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి , ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో పాటు సమస్యల పరిష్కారం కోసం సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ JAC ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వంను కోరారు. ఏజెన్సీలు అకారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తుండంతో తమకు నష్టం జరుగుతుందని, ESI, PF కూడా చెల్లించడం లేదన్నారు. తాము కస్టపడి ఉద్యోగం చేస్తే… ఏజెన్సీలు తమ శ్రమను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కారం చూపించాలని వారు కోరారు.

Read Also: పెట్రోల్ విడిగా అమ్మితే కఠిన చర్యలే: కేంద్రం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>