Mobile Popup Ad
Mobile Popup Ad

గులాబీ బాస్ పిలుపు: నేడు ఎర్రవల్లికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) నేడు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కేసీఆర్ (KCR) ఆహ్వానం మేరకు తన ప్రధాన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి ఈ భేటీకి హాజరవుతున్నారు. నిన్న కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన నేపథ్యంలో, నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో కేసీఆర్, జీవన్ రెడ్డిలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా పాల్గొంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR), మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎల్. రమణ తదితరులు ఈ భేటీకి హాజరుకానున్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యాచరణపై వీరు సుదీర్ఘంగా చర్చించనున్నారు. భోజన విరామ అనంతరం జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>