ఏం చేసుకుంటారో చేసుకోండి: జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : తాడిపత్రి పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఏమి చేస్తాం, ఏం అవుతుంది, ఇక్కడే ఉన్నాం కదా” అంటూ సవాల్ విసిరారు. ఎలాగూ కాల్చామనే మాట ఉందని, ఇంకో నాలుగైదు కాల్చేస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు.

తాడిపత్రి (Tadipatri) ఘర్షణల సమయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా పలు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు. వైసీపీ మరియు పెద్దారెడ్డితో పోలీసులకు ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అని ఆయన ప్రశ్నించారు.

తనపైనా, తన కుమారుడిపైనా 307 కేసులు నమోదు చేయడంపై జేసీ (JC Prabhakar Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరి ఆచూకీని వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొందరు ఐపీఎస్ అధికారుల వల్లే పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. ఇకపై తాడిపత్రిలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దానికి జిల్లా ఎస్పీదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.

Also Read : కూటమితో సంబంధం లేదు.. జనసేన సంచలన ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>