ఎవరేం చేస్తున్నారో తెలుసు.. సీఎం రేవంత్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ఎవరేం చేస్తున్నారో తమకు అన్నీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంసతృప్తి నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ముందు ఏం చేస్తున్నారో, వెనుక ఏం మాట్లాడుతున్నారో తమ వద్ద డేటా ఉందని తెలిపారు. ఢిల్లీలో పరిచయాలుంటే, గాంధీ భవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. వ్యూహాలు, ఎత్తుగడలు మాకు వదిలేయాలన్నారు. రాజకీయాల్లో బ్యాలెన్స్‌ షీట్ అయిదేళ్లకోసారి మాత్రమే వస్తుందని.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తల కసి మాత్రమే కారణమని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అదే స్పూర్తితో రెండోసారి అధికారంలో రావాల్సిందేనన్నారు. పార్టీ లైన్‌లో ఉన్నవారికే పదవులు వస్తాయన్నారు. పేదలకు ఆత్మబంధువు అయితే.. పార్టీకి ఆత్మబంధువు అవుతారన్నారు. జనగణనలో కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించామన్నారు. 4.75 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

సంక్రాంతి తరువాత ప్రజల్లోకి..

సంక్రాంతి తరువాత ప్రజల్లోకి వెళ్లబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోటి ఓట్లు, 90 సీట్లు గెల్చుకుని మరోసారి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. అగ్గి పెట్టె దొరకని హరీశ్ రావు మంత్రి అయితే.. శ్రీకాంతా చారి ఆత్మార్పణ చేసుకుని అమరుడైనట్లు వివరించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలను కూడా గెలవబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని బీఆర్ఎస్ నేతలు కూడా మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు పదే పదే గుర్తుకు చేస్తుండాలని.. లేకపోతే మర్చిపోయే ప్రమాదం ఉందన్నారు. చేసిన మంచి చెప్పుకోవడంలో తప్పేం లేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>