కూటమితో సంబంధం లేదు.. జనసేన సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) హడావిడి కొనసాగుతున్న వేళ జనసేన పార్టీ (Janasena) తమ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, క్షేత్రస్థాయిలో గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతాయని పార్టీ పేర్కొంది. ఈ క్రమంలో మున్సిపల్, పరిషత్ (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల తరహాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య ఎలాంటి సీట్ల సర్దుబాట్లు లేదా పంపకాలు ఉండవని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.

ఈ మేరకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ (Janasena) నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చునని జససేన అధినాయకత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పోటీ చేయాలనుకునే కార్యకర్తలను పార్టీలోని స్థానిక నాయకులు ఎవరూ నిలువరించవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే పార్టీ ప్రధాన ఉద్దేశమని, గ్రామాల్లో ప్రజాబలం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని అధిష్ఠానం భరోసా ఇచ్చింది.

Also Read : బైకర్ నిర్లక్ష్యం.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>