ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ బరిలోకి కమిన్స్‌

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్‌-2027కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)కు కీలక సమాచారం అందింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ సారథి పాట్‌ కమిన్స్‌ వచ్చే సీజన్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సీజన్‌ కాకపోయినా, కనీసం కొంతకాలం అందుబాటులో ఉంటానని తనతో చెప్పినట్లు జట్టు సహచరుడు వెల్లడించాడు. కమిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.18 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అయితే గత సీజన్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి ఆలస్యంగా అనుమతి రావడంతో అతడు కేవలం ఎనిమిది మ్యాచ్‌లే ఆడాడు. అతడి గైర్హాజరీలో ఇషాన్‌ కిషన్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఈసారి కూడా కమిన్స్‌ పూర్తి సీజన్‌ ఆడటంపై స్పష్టత లేదు. ఆస్ట్రేలియా షెడ్యూల్‌ దీనిపై ప్రభావం చూపనుంది. జనవరి నుంచి మార్చి మధ్య భారత్‌తో ఐదు టెస్టులు సహా మొత్తం తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌ ఉంది. దీంతో ఐపీఎల్‌లో అతడి భాగస్వామ్యం ఎంతకాలం ఉంటుందనేది తేలాల్సి ఉంది.

మరోవైపు, మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌-2027 నుంచి తప్పుకోగా, ట్రావిస్‌ హెడ్‌ పనిభారం కారణంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కమిన్స్‌ కొంతకాలమైనా అందుబాటులో ఉంటానని చెప్పడం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఊరటనిచ్చే అంశం. డిసెంబర్‌ 16న గోవాలో జరగనున్న మినీ వేలానికి ముందు ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>