హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల‌ హై అల‌ర్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్ న‌గ‌రానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్‌ (Hyderabad)లో 26/11 ముంబై త‌ర‌హా ఉగ్ర‌దాడులు చేస్తామంటూ ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబా పేరుతో పోలీసుల‌కు ఆదివారం సాయంత్రం ఓ ఈమెయిల్ వ‌చ్చింది. ఈ-మెయిల్‌లో కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామని హెచ్చరించినట్లు హైదరాబాద్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ వెల్లడించింది.

ఈ బాంబు పేలుళ్ల‌తో క‌నీసం 300 మందిని చంపేస్తామ‌ని స‌ద‌రు ఈమెయిల్‌లో హెచ్చ‌రించారు. త‌మ నాయ‌కుడి హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకునేందుకే ఈ బాంబు పేలుళ్లు జ‌రుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఈమెయిల్‌తో హైద‌రాబాద్ పోలీస్ శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. న‌గ‌రంలోని ముఖ్య ప్రాంతాల్లో, ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్ప‌ద వ్య‌క్తులు, వ‌స్తువుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. బాంబ్ స్క్వాడ్ త‌నిఖీలు, పెట్రోలింగ్ పెంచాల‌ని స్పెష‌ల్ బ్రాంచ్ అల‌ర్ట్ చేసింది. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా ఫేక్ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ ఎక్కువ‌గా వ‌స్తున్న నేప‌థ్యంలో పోలీసులు ఈ మెయిల్‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>