కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జపాన్ (Japan) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తన వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో చమురును రిలీజ్ చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జపాన్ ప్రధాని సనే తకైచి (Sanae Takaichi) ఆదేశాలు జారీ చేశారు. దీంతో జపాన్ ప్రభుత్వం తన జాతీయ నిల్వల నుంచి సుమారు 80 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. ఇది ఆ దేశ 45 రోజుల మొత్తం వినియోగానికి సమానం.
జపాన్ లో ఎనర్జీ ఎమర్జెన్సీ ..
సాధారణంగా యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే జపాన్ తన చమురు అవసరాల కోసం 90 శాతానికి పైగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడింది. దీనివల్ల జపాన్ కు రావాల్సిన ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. అంతేకాదు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి దూసుకుపోతుండటంతో జపాన్ పెట్రోల్ ధరలను నియంత్రించడానికి, పరిశ్రమలు మూతపడకుండా చూడటానికి ఈ ‘ఎనర్జీ ఎమర్జెన్సీ’ని విధించింది. అయితే ఇది జపాన్ చరిత్రలో 2011 ఫుకుషిమా విపత్తు సమయంలో విడుదల చేసిన దానికంటే 1.8 రెట్లు ఎక్కువ. దీంతో ఇది జపాన్ (Japan) ఇంధన రంగ చరిత్రలో అతిపెద్ద అత్యవసర పరిస్థితిగా నిలిచింది.
Read Also: పాన్ కార్డ్ కొత్త రూల్స్: ఆధార్‌తో పాటు ఇవి కూడా మస్ట్!
Follow Us On: X(Twitter)

