Mobile Popup Ad
Mobile Popup Ad

అల్వాల్​ లో దారుణం : తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చేసిన కూతురు

కలం, వెబ్ డెస్క్​ : హైదరాబాద్‌లోని అల్వాల్ (Alwal) పరిధిలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లిని హత్య చేసి, ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు ఏడాది క్రితం గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ దారుణం పోలీసుల విచారణలో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. అంజు (45) అనే మహిళ గత ఏడాది కాలంగా కనిపించకుండా పోవడంతో ఆమె పెద్ద కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, చిన్న కుమార్తె, ఆమె భర్త కుమార్ సింగ్‌ల ప్రవర్తనపై అనుమానం కలిగింది. విచారణ సమయంలో వారు చెప్పే మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయటపడింది.

అంజును తామే చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితులు చూపించిన స్థలంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఒక తల్లిని కన్నకూతురు, అల్లుడు కలిసి అంతమొందించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Read Also: మాంసం ప్రియులకు భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>